నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయాలు..ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. చవకగా లభించే కొత్తిమీర ధర కూడా ఊహించని విధంగా పెరిగింది. ఐదు రూపాయలకు రెండుమూడు కట్టలు లభించేవి. అయితే కిలో కొత్తిమీర ఏకంగా రూ. 400కు చేరుకుంది. నిన్నమొన్నటి వరకు కిలో కొత్తమీర రూ. 80 నుంచి రూ. 100 పలకగా వరంగల్, ఖమ్మం మార్కెట్‌లలో ప్రస్తుతం రూ. 400కు పైనే పలుకుతోంది. కర్ణాటక నుంచి కొత్తిమీర ఈ మార్కెట్లకు సరఫరా అవుతోంది. కర్ణాటకలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. దీంతో అక్కడి నుంచి ప్రస్తుతం అరకొరగా సరఫరా అవుతోంది. కొద్దిమొత్తంలో వస్తున్న కొత్తిమీర కోసం వ్యాపారులు పోటీపడుతుండడంతో దాని ధర అమాంతం కొండెక్కింది. పలుమార్కెట్లలో కిలో రూ. 400 వరకు పలికింది. మహబూబాబాద్ జిల్లాలో రోజుకు 20 క్వింటాళ్ల కొత్తిమీర అవసరం కాగా, ప్రస్తుతం రోజుకు 5 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని, ధరల పెరుగుదలకు ఇదే కారణమని వ్యాపారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement