Thursday, January 16, 2025

Warangal – ఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన రైతులు


‌‌‌‌‌‌‌‌
ఐదు రోజుల త‌ర్వాత తెరుచుకున్న మార్కెట్ యార్డు
విక్ర‌యాల‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చిన ప‌త్తి, మిర‌ప

వరంగల్ , ఆంధ్ర‌ప్ర‌భ : సంక్రాంతి సంద‌ర్భంగా ఐదు రోజుల సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పునః ప్రారంభమైంది. వరుస సెలవుల అనంతరం మార్కెట్‌ యార్డు తెరుచుకోవ‌డంతో తమ పంటలను విక్రయించేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో పత్తి, మిర్చి బస్తాలతో మార్కెట్‌ కళకళలాడుతోంది. ముఖ్యంగా ప‌త్తి పంట‌ భారీగా వచ్చింది. రైతులు భారీగా తరలిరావడంతో అందుకనుగుణంగా అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు.

మార్కెట్‌లో ధ‌ర‌లిలా..
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. సుమారు 5,000 మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేశారు. మిర్చి ధరలు నిలకడగా ఉన్నట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. మిర్చి తేజాలు క్వింటాకు రూ.14800, వండర్ హాట్ క్వింటాకు రూ.13000, యూఎస్ క్వింటాకు రూ.15000 పలుకుతున్నట్లు అధికారులు తెలిపారు. పత్తి ధర క్వింటాకు రూ.7421గా ఉంది.

- Advertisement -

ఆదిలాబాద్‌లో …
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సంక్రాంతి సెలవుల తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభ‌మ‌య్యాయి. పత్తి ధరలో సీసీఐ కోత విధించింది. మార్కెట్ యార్డులో నాణ్యత పేరుతో మద్దతు ధరలో మరో రూ.50 కోత విధించింది. మద్దతు ధర పత్తి క్వింటాకు రూ.7521గా ఉండగా.. ఇంతకు ముందు రూ.50 కోత విధించింది. తాజాగా మరో రూ.50 కోత పడింది. తగ్గించిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రోజు పత్తి ధర రూ.7421 మాత్రమే. 15 రోజుల వ్యవధిలో సీసీఐ అధికారులు వంద రూపాయలు కోత విధించారు. ప్రైవేట్ మార్కెట్‌లో పత్తి ధర క్వింటాకు రూ.7060 పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement