Monday, December 2, 2024

Warangal – పూల కుండీల్లో గంజాయి మొక్క‌లు

ఇంటి య‌జ‌మాని అరెస్టు
ప‌సిగ‌ట్టిన పోలీసు జాగిలం
మొక్క‌లు స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, కరీమాబాద్ (వ‌రంగ‌ల్ జిల్లా) : ఓ వ్య‌క్తి త‌న ఇంటి మేడ‌పైన పూల కుండీల్లో గంజాయి మొక్క‌లు పెంచుతున్న యాంటీ డ్ర‌గ్స్ టీమ్ పోలీసుల‌కు అడ్డంగా బుక్ అయ్యాడు. త‌మ‌కు ప‌ట్టుబ‌డిన నిందితుడిని మీల్స్ కాల‌నీ పోలీసుల‌కు అప్ప‌గించారు.

ఇంటి య‌జ‌మాని అరెస్టు
వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ అనే 60 ఏళ్ల వృద్ధుడు తన ఇంటి మేడపైనే పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. గురువారం రైల్వే స్టేషన్ తనిఖీలు చేప‌ట్టిన‌ యాంటీ డ్రగ్స్ టీం పోలీసులకు ఈ విష‌యాన్ని కొంద‌రు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మత్తు పదార్థాలను పసిగట్టే జాగిలంతో మేడ పైన గంజాయి మొక్కలు ఉన్న‌ట్లు గుర్తించారు. గంజాయి మొక్క‌ల‌ను స్వాధీనం చేసుకుని, నిందితుడు కుమార్‌ను అరెస్టు చేసిన‌ట్లు టాస్క్​ఫోర్స్ సీఐ జే.సురేష్, సిబ్బంది ఆరే శివకేశవులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement