వరంగల్ జిల్లాలో వెలుగులోకి
ముగ్గురు యువకుల పైశాచికత్వం
బలవంతంగా మద్యం తాగించి ఘాతుకం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
ఆంధ్రప్రభ స్మార్ట్, వరంగల్ : వరంగల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మశీ రెండో సంవత్సం చదువుతున్నవిద్యార్థిని పై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బలంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. గత నెల 15న సంఘటన జరగ్గా , ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కారు ఎక్కించుకు వెళ్లి…
భూపాలపల్లి జిల్లాకు చెందిన పార్మశీ విద్యార్థిని హాస్టల్లో ఉంటూ చదువుతోంది. ఈ నెల 15న ఓ యువకుడి బలవంతంగా కారులోకి ఎక్కించాడు. అప్పటికే అందులో ఇద్దరు యువకులు ఉన్నారు. వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపలోన ఒక లాడ్జి మొదటి అంతస్తులోకి తీసుకు వెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ముగ్గురు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.
కుటుంబ సభ్యలకు చెప్పిన బాధితురాలు
ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంటికెళ్లిన బాధితురాలు కుటుంబ సభ్యులకు ఈ విషయం ఆ విద్యార్థిని చెప్పింది. రెండు రోజుల కిందట తల్లి, యువతి ఇద్దరూ కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను కలిసి జరిగిన సంఘటన వివరించారు. మొదట హనుమకొండ పోలీసులకు రిఫర్ చేసినట్లు తెలిసింది. ఆ ప్రాంతం ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో సంఘటన జరిగినట్లు తెలుసుకుని యువతిని అక్కడికి పంపించారు. ఇంతేజార్గంజ్ ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇంతెజార్ గంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాలను అనుసరించి ఆమెను నిర్బంధించిన కూరగాయల మార్కెట్ సమీపంలోని లాడ్జిలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అక్కడ ప్రధాన నిందితుడు ఇచ్చిన ఆధార్ కార్డ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
మరో నిందితుని కోసం గాలింపు
ఆధార్ సాయంతో బాధితురాలి మిత్రుడితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిది భూపాలపల్లిగా గుర్తించారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూడో నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇంతెజార్ గంజ్ పీఎస్ సీఐ శివకుమార్ తెలిపారు. బాధిత యువతిని భరోసా కేంద్రానికి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు. ఇదే హోటల్ లో గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగినట్లు తెలిసింది.