Saturday, January 4, 2025

Warangal – డిప్యూటీ మేయర్ కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ‌

వరంగల్ /కరీమాబాద్ ( ఆంధ్రప్రభ) వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీం మసూద్ కుటుంబాన్ని మాజీ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పరమార్శించారు.. డిప్యూటీ మేయర్ రిజ్వనా షమీం మాసూద్ సోదరుడు సయ్యద్ మహమ్మద్ అనారోగ్యం తో హైదరాబాదులోని యశోద హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలియగానే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిప్యూటీ మేయర్ నివాసానికి వెళ్లి సయ్యద్ మహమూద్ పార్థివా దేహానికి నివాళులు ఆర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం లో 36 వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement