Sunday, November 24, 2024

Warangal – ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలతో తొలగింపు..

వరంగల్ కార్పొరేషన్, ఆగస్టు 3 ప్రభ న్యూస్: ఎఫ్ టి ఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై వరంగల్ మహా నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝులిపించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని చిన్న వడ్డేపల్లి కోట చెరువు బంధం చెరువులలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ప్రహరీ గోడలు,రేకుల షెడ్లను, పోలిసుల సహాయంతో బల్దియా సిటీ ప్లానర్ ఎం .శైలజ నేతృత్వంలో శనివారం తెల్ల వారు జామున నేలమట్టం చేశారు.

ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి గ్రేటర్ పరిధిలోని ఆరు చెరువుల్లో ఇప్పటికే బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు అని హెచ్చరించడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు బల్దియా కమిషనర్, టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ లు అక్రమ నిర్మాణాలపై విరుచుకు పడుతున్నారు.

వందలాదిమంది పోలీసుల సహాయంతో ఎలాంటి ఇండ్లను ముట్టుకోకుండా కేవలం కాంపౌండ్లను మాత్రమే తొలగించడం విశేషం. గత నెలలో భద్రకాళి చెరువు ఏప్రిల్ పరిధిలోనే అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement