వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది.. వరద ఉదృతి పోటేత్తడంతో పోతన నగర్ వైపు ఉన్న కట్ట తెగిపోయింది.. దీంతో చెరువులోని నీరంతా ఉదృతంగా బయటకు ప్రవహిస్తున్నది.. సరస్వతినగర్, పోతననగర్,పాటు చుట్టు ఉన్న కాలనీలపై వైపు వేగం వరద నీరు దూసుకువస్తున్నది.. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. అలాగే గండి పూడ్చే పనికోసం సిబ్బందిని అక్కడికి తరలిస్తున్నారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్ ప్రావిణ్య, నగర మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా ఆధ్వర్యంలో ముంపు బాధితులకు సహాయ,పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి