ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన వరంగల్‌ను హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వరంగల్ జిల్లాను ఎడ్యుకేషన్ , క్రీడా,హెల్త్, టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్, యువజన క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి .శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వచీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండు సుధాాంణితో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్‌ను క్రీడాహబ్‌గా మార్చి స్పోర్ట్స్ పాలసీ వచ్చే విధంగా కృషిచేస్తూ అభివృద్ధిలో అగ్రగామిగా మార్చాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు దృఢసంకల్పాన్ని నెరవేర్చే విధంగా కృషి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గత ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు వచ్చి వెళ్లారు తప్ప అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.
వరంగల్ అభివృద్ధికి రూ. 3,248 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వరంగల్ జిల్లాను ప్రత్యేకంగా అభిమానించే వ్యక్తిగా 3,248 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, వాటితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. 1,100 కోట్ల రూపాయల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం శుభపరిణామమని చెప్పారు. మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎయిర్‌పోర్ట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామన్నారు. వరంగల్ పోర్ట్, వేయిస్తంభాల గుడి, లక్నవరం, రామప్ప టెంపుల్, మేడారం జాతరతో గొప్ప పర్యాటక ప్రాంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్రపుటల్లో నిలుస్తుందన్నారు. అభివృద్ధిలో పోటీ తత్వంతో పనిచేసే శాసన సభ్యులు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. సర్వమతాల అభివృద్ధిని కాంక్షిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ కోట కాకతీయుల చరిత్ర మనకంటే ఎక్కువ ప్రజలకు తెలుసునని, గతంలో ఉన్న అభివృద్ధి ఇప్పుడు ఉన్న అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నిరంగాల్లో లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో పనిచేసిన వ్యక్తి.. మంత్రి శ్రీని వాస్‌గౌడ్ అన్నారని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో అనేక కుట్రలు నడిచాయని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కేసీఆర్ దృఢసంకల్పం గొప్పదన్నారు. అభివృద్ధిని ప్రజలు ఆస్వాదిస్తారని, గొప్ప పర్యాటక ప్రాంతంగా వరంగల్ విలసిల్లుతోదంన్నారు. మేడారం జాతర సమయంలో 80 వేల మంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని వీక్షించారన్నారు.