ఆంధ్రప్రభ స్మార్ట్, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా రాయపర్తి స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. లాకర్ లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సుమారు పది కోట్ల రూపాయల విలువ చేసే బంగారం అపహరించినట్లు తెలిసింది. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
క్లూస్ టీమ్.. డాగ్ స్క్వాడ్… దర్యాప్తు
రాయపర్తి స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో చోరీపై క్లూస్ టీమ్.. డాగ్ స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించింది. గ్యాస్ కట్టర్తో కిటికీలను కట్ చేసి లోపలకు ప్రవేశించినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే లాకర్ల గదిలోకి వెళ్లి ఖాతాదారులు ఉంచిన బంగారం అపహరించారు. లాకర్ల ఉన్న నగదు కూడా ఎంత పోయిందో తెలియవలసి ఉంది. పూర్తిగా దర్యాప్తు చేస్తే తప్పా ఎంత మేరకు నష్టం వాటిల్లిందో తేలుతుందని అధికారులు చెబుతున్నారు.