హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇంకా వారం రోజులు కాలేదు… అప్పుడే విపక్ష బీఆర్ఎస్ విమర్శల యుద్ధానికి తెర తీసింది.. అసెంబ్లీ సమావేశాలలో సైతం మాటల దాడితో హీట్ పెచ్చింది. కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సాకులు చెబుతున్నారంటూ గులాబీ నేతలు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు.
ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్లర్ లో రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదని కర్ణాటక సీఎం అన్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే జరుగుతుందా? విపరీతమైన ప్రకటనలు హామీలు ఇచ్చేముందు మీకు కనీసం ఆర్థిక పరిస్థతిపై పరిశోధన ప్రణాళిక ఉండదా?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.