Monday, November 18, 2024

TS: 24గంటల కరెంట్ కావాలా..? మూడు గంటల కరెంట్ కావాలా..? – కేటీఆర్

కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రైతాంగానికి మూడు గంటల కరెంట్ మాత్రమే వస్తుందని, బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే 24 గంటల కరెంట్ వస్తుందని.. ఎన్ని గంటల కరెంట్ కావాలో మీరే తేల్చుకోండని రాష్ట్ర మున్సిపల్ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. బుధవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సి.సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తిలు గులాబీ పార్టీలో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడుతూ… కర్ణాటకలో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ప్రాధేయపడితే ప్రజలు నమ్మి ఓటు వేసిన కర్మకు నాలుగు నెలలకే రోడ్లపైకి రావలసిన దుస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధును రూ.16000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఆసరా పింఛన్లను ఐదు వేలకు, వికలాంగుల పింఛన్లను ఆరు వేలకు పెంచుతున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ 400కే అందిస్తామన్నారు. పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా మార్చామని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement