Thursday, November 7, 2024

Wanaparthy – మాట తప్పిన మీకు మాట్లాడే అర్హత లేదు – ఎమ్మెల్యే తూడి

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 31(ఆంధ్రప్రభ):రైతు రుణమాఫీ చేస్తామని పదేళ్లపాటు కాలయాపన చేసి అన్నదాతలను నిలువునా మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు లేదని వనపర్తి ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి విమర్శించారు.

గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేపట్టిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.అన్ని వనరులున్న తెలంగాణను 7లక్షల 12 వేల కోట్ల అప్పుచేసి అప్పుల కుప్పగా మార్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు.మీరు చేసిన అప్పుల ఫలితంగా ప్రతినెల 5600 కోట్ల రూపాయల మిత్తి చెల్లించాల్సి వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మీటింగ్లల్లో రైతుల చేత చేతులెత్తించడం కాదని రుణమాఫీ అంశంలో బహిర్గతంగా చర్చకు రావాలని ఎమ్మెల్యే సూచించారు.సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

- Advertisement -

అభివృద్ధి అంటే కాలేజీలు కార్యాలయలే కాదని గ్రామ గ్రామంలో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన నాడే సర్వతో ముఖాభివృద్ధి సాధించిన వారమవుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదవులు పోయి పది నెలలు కాకముందే కారు కూతలు కూసే నాయకులు ముందు ఆసుపత్రులలో చేరి మంచి వైద్యం చేయించుకోవాలని సలహా ఇచ్చారు.

నియోజకవర్గ ప్రజలందరికీ ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు, పింఛన్లు, రుణమాఫీ, విద్యుత్ రాయితీ, సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం రేషన్ కార్డులతో సహా అన్ని రకాలైన ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందజేస్తామని ఎమ్మెల్యే కార్యకర్తలకు భరోసా కల్పించారు.

గతంలోఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేవలం బిఆర్ ఎస్ కార్యకర్తలకు నాయకుకు మాత్రమే వేదికగా ఉండేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రజలందరూ స్వేచ్ఛగా క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నే విజయడంక మోగిస్తుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు సంబంధించిన 592 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెబ్బేరు, శ్రీరంగాపురం, పెద్దమందడి, ఖిల్లా గణపురం, వనపర్తి, రేవల్లి, గోపాల్పేట, ఏదుల మండలాల నాయకులు గ్రామాల నాయకులు లబ్ధిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు._

Advertisement

తాజా వార్తలు

Advertisement