Thursday, January 23, 2025

Wanaparthi – కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో వ‌న‌ప‌ర్తి సస్యశ్యామలం – మంత్రి. జూపల్లి

వనపర్తి ప్రతినిధి, జనవరి23(ఆంధ్ర ప్రభ):ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాంతం నుండి ఒకప్పుడు వలసలు వెల్లేవారని,మహాత్మ గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పుడు సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తుచేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాల పై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా గురువారం ఉదయం ఘనపూర్ మండలంలోని సల్కలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్లలో గుట్టలకు, కాలువలకు, ఇతర వాటికి రైతు భరోసా పేరుతో రూ. 25వేల కోట్ల ప్రజా ధనం అన్యాక్రాంతం చేసిందని,ప్రభుత్వ లక్ష్యాలు అన్యాక్రాంతం కాకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలనే గ్రామ సభలు పెట్టీ ప్రజామోదం పొందటం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకే అందాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోయిన, పేర్లు జాబితాలో లేకున్నా నమోదు చేసుకొనేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఒకప్పటి ప్రజాకోర్టును తలపిస్తున్న గ్రామ సభ:ఎంపీ. మల్లు రవి

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి మాట్లాడుతూ సల్కలాపూర్ లో ఏర్పాటు చేసిన గ్రామ సభ ఒకప్పటి ప్రజాకోర్టును తలపిస్తుందనీ,ప్రజాకోర్టులో న్యాయ అన్యాయాలను విచారించినట్లె గ్రామ సభలో నిజమైన లబ్ధిదారుల ఎంపిక ప్రజల ఆమోదంతో రూపొందించడం జరుగుతుందన్నారు.సంక్షేమ పథకానికి అర్హత లేని వారి పేరు ఉంటే చెప్పాలని అందుకే జాబితా ప్రజల ముందు పెడుతున్నట్లు తెలియజేశారు.

- Advertisement -

బ్యాంకు, నైపుణ్య శిక్షణ కేంద్రo ఏర్పాటు:ఎమ్మెల్యే. మేఘా రెడ్డి

స్థానిక శాసనసభ్యుఢు మేఘా రెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఆరు గ్యారంటీ కార్డును ప్రతి ఇంటికి పంపించి ఓట్లు అడగడం జరిగిందని, దీనిని నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయడం వల్ల ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పారు. సల్కలా పూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామి ఇచ్చారు.ఈ ప్రాంత ప్రజలకు ఒక బ్యాంకు, ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులను కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్,ఆర్డీఓ సుబ్రమణ్యం, ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి, తహసిల్దార్, ఎంపీడీఓ, సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి , అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement