Monday, November 25, 2024

TS assembly: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. చచ్చిపోయిన పామును ఎవరు చంపుతారు.. కేసీఆర్ అనే పాము మొన్న ఎన్నికల్లో చనిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపక్ష బాధ్యత నుంచి తప్పించుకొని నల్గొండలో ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ‘‘నన్ను చంపేస్తారా అని కేసీఆర్ అంటున్నారు. చచ్చిన పామును ఇంకా ఎవరూ చంపరు. అంగీ, లాగు ఊడదీసి ప్రజలు కట్టెతో కొట్టి చంపారు’’ అని వ్యాఖ్యానించారు.

స్పీకర్ అనుమతితో కృష్ణా, గోదావరి జలాలపై నిర్మించిన ప్రాజెక్టులపై గత మూడు రోజుల నుంచి అసెంబ్లీలో వాస్తవాలు చర్చిస్తున్నామని, తెలంగాణపై రైతులు, సమాజంపై గౌరవం ఉంటే బాగుండేది. ప్రధాన ప్రతిపక్షం ఒక్కతాటిపైకి వచ్చి ప్రాజెక్టులను పరిశీలించిందని.. లేకుంటే కొత్త ప్రభుత్వమే తప్పని అన్నారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడే భాషపై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement