వాజేడు ఏప్రిల్ 29 ప్రభ న్యూస్: ప్రభుత్వ వైద్యం ప్రజల చెంతకు చేరడం లేదు వైద్యుల నిర్లక్ష్యంతో రోగులు అష్ట కష్టాలు పడుతున్నారు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు లేకపోవడంతో రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు వైద్యులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడంతో సోమవారం వైద్యశాలకు వచ్చిన రోగులకు స్టాఫ్ నర్స్ హెల్త్ సూపర్వైజర్ మాత్రమే రోగులకు నచ్చ చెబుతూ డాక్టర్ వస్తున్నారు వేచి ఉండండి సమాధానం ఇస్తున్నారు..
దీనితో ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న వైద్యులు ఇంతటి నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని పలువురు మండిపడుతున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు నిరాశతో వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ వైద్య ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.