Friday, November 22, 2024

Vyara – మరి కొన్ని గంటలలో మూడో విడత రైతు రుణ మాఫీ …

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్‌: రుణమాఫీ మూడో విడత కింద ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.

. గతనెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది.ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత రుణమాఫీ చేయనుంది.

- Advertisement -

అయితే రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు.. ఆ అదనపు మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఆ అదనపు మొత్తాలను చెల్లించారు? ఇంకా ఎంతమంది చెల్లించాల్సి ఉంది? చెల్లించని వారికి ఇప్పుడు రుణమాఫీ కాకపోతే తర్వాత చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement