హైదరాబాద్ – : గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)ల విద్యార్హతలు, సామర్థ్యాల మేరకు వారిని నీటి పారుదల, ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం .. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీఆర్‌ఏల సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని, వారి అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
వీఆర్‌ఏల సర్దుబాటుపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఉప సంఘం రేపటి నుంచి వీఆర్‌ఏలతో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకోనుంది. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మొత్తం ప్రక్రియ వారంలోపు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు