Monday, November 18, 2024

Voters boycott – పోలింగ్ ను బహిష్కరించిన రాజుల పాలెంలో గ్రామస్తులు

ఏన్కూరు,నవంబర్ 30,( ప్రభ న్యూస్ ): మండల పరిధిలోని రాజుల పాలెం గ్రామంలో గ్రామస్తులు ఓట్లు వేయ కుండ ఓటిం గును బహిష్కరించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..మేము 30 సం వత్సరాల నుండి రాజుల పాలెం గ్రామంలో నివసిస్తున్నామని అన్నారు.రాజుపాలెం నుండి రేపల్లెవాడ- నాచారం గ్రామాల మధ్య వెలసిన అద్భుత శ్రీ వెంకటేశ్వర స్వా మి దేవస్థానానికి వెళ్లడానికి మేము చాలా బాధలు పడుతున్నామన్నారు.రాజుల పాలెం నుంచి రామ తండా, గంగుల నాచారం- నాచారం మీదగా తిరిగి వెళ్లాలంటే సుమారు 10 కిలోమీటర్లు ఉండటంతో మేము స్వామి వారి దగ్గరికి వెళ్లలేక పోతు న్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా రాజుల పాలెం నుంచి హిమం నగర్,రేపల్లెవాడ గ్రామాల మీదుగా మీదుగా వెళ్లడానికి సుమారు 10 కిలోమీటర్లు ఉండడంతో స్వామి దగ్గరికి వెళ్లలేక నానా అవస్థలు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆగ్రహ వ్యక్తం చేశారు.రాజుల పాలెం గ్రామ సమీపంలో ఉన్న లింక్ రోడ్డు నుంచి నా చారం గ్రామంలో వెలిసిన అద్భుత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్లడానికి కి లోమీటర్ ఉండడంతో మాకు రహదారివేయాలని, అదేవిధంగా స్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు.అధికారులు వచ్చి మా సమస్యను పరిష్కరించేంతవరకు గ్రామంలో ఎవరు కూడా ఓటు వేయమని భీ ష్మించి రహదారిపై గ్రామస్తులు కూర్చున్నారు.

మండల తహసిల్దార్ శేషగిరిరావు వివరణ అడగగా. ఆ గ్రామస్తులు ఓట్లు వేసిన వెయ్యకపోయినా మాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement