Friday, November 22, 2024

TS: స్పష్టమైన అవగాహనతో ఓటు వేయాలి.. కేసీఆర్

హుస్నాబాద్ : స్పష్టమైన అవగాహనతో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్ లో నిర్వహించిన బహిరంగలో కేసీఆర్ మాట్లాడుతూ… ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందని అన్నారు. అందరి సహకారంతో తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లామన్నారు. పారిశ్రామిక రంగంలో మనతో ఎవరూ పోటీ పడలేరన్నారు. కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు.

కొన్ని పార్టీలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాయన్నారు. 60ఏళ్లుగా అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. పెన్షన్ ను రూ.2వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ దేనన్నారు. ఇప్పుడు పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతున్నామన్నారు. హుస్నాబాద్ ఆశీర్వాదంతో ఆనాడు 88సీట్లు గెలిచామన్నారు. మళ్లీ హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నామన్నారు. ఎన్నికలయ్యాక ఐదారు నెలల్లో గౌరవెళ్లి ప్రాజెక్టును ప్రారంభిస్తానన్నారు. శనిగరం ప్రాజెక్టు మరమ్మత్తు చేయిస్తానన్నారు. కొత్తకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదేనన్నారు. రాబోయే రోజుల్లో దేశానికి మరింత ఆదర్శం కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement