Sunday, November 24, 2024

ఓటుకు నోటు కేసు.. విచారణ వేగవంతం!

తెలుగు రాష్ట్రాలను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును ఏసీబీ కోర్టు వేగవంతం చేసింది. గురువారం ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఈ కేసులో సాక్షుల విచారణ వేగంగా పూర్తి చేయాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్లో త్వరగా విచారణ పూర్తిచేయాలని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అందుకే రాజకీయ నేతలు నిందితులుగా ఉన్న ఈ ఓటుకు నోటు కేసులో త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

అయితే, ఈ కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి స్పందిస్తూ వారంలో 2 రోజులే సాక్షుల విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మరో నిందితుడు సెబాస్టియన్ స్పందిస్తూ, సాక్షుల విచారణ వారానికోసారి జరపాలని విన్నవించారు. కరోనా బారినపడ్డానని, రోజువారీ విచారణ తనకు ఇబ్బందికరంగా ఉందని సెబాస్టియన్ వెల్లడించారు. వాదనల అనంతరం, ఈ నెల 26 నుంచి ఆగస్టు 23 వరకు సాక్షులను విచారిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement