ఇందూరులో ఊర పండుగను నగర ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊరపండును జరపడంలో నిజాంబాద్ నగర ప్రజలు ప్రత్యేక చాటుకుంటు న్నారు. పాడి పంటలు ఆయురారోగ్యాలతో అందరూ సుఖశాంతులతో చల్లంగా ఉండేలా దీవించు తల్లి అంటూ అమ్మవారిని ఇందూరు ప్రజలు వేడుకున్నారు.. ఆదివారం నిజాంబాద్ నగరంలో ఊర పండుగ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా నగర ప్రజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పండుగ విశేష పదార్థంగా సరిని నగరంలో చల్లుతూ పంటలపై పశుసంపదలపై చెరువులో కలిపారు.
ఊర పండుగ నిర్వాహణ కమిటీ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె( తేలు మైసమ్మ గద్దె) వద్ద గ్రామదేవతలను పసుపు కుంకుమ, చెవి పోగుల ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దేవతామూర్తులను ఊరేగింపుగా ఖిల్లా చౌరస్తా నుంచి గాజులపేట చౌరస్తా మీదుగా పెద్ద బజారు చౌరస్తా వరకు వచ్చి… అక్కడనుండి రెండు బృందాలుగా విడిపోయి డబ్బులు…పోతరాజుల విన్యాసాలతో మహిళల పూనకాలతో ఒక బృందం పౌడలమ్మ.. నల్ల పోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ ,పులి రాట్నం , రెండో బృందం సిర్నాపల్లి గడి గోల హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్ నగర్ ఐదు చేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ మహాలక్ష్మ మ్మలతో అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. సరిని నాలుగు గ్రూపులుగా విభజించి దుబ్బ వినాయక ఎల్లమ్మ గుట్ట కంటేశ్వర్ ప్రాంతాలకు చల్లుకుంటూ వెళ్లారు..
తొట్టెల కింద నుంచి వెళ్లేందుకు పోటీ పడ్డ జనం
ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊరపండును జరపడంలో నిజాంబాద్ నగర ప్రజలు ప్రత్యేక చాటుకుంటున్నారు. అమ్మవారి ప్రతిరూపంగా తొట్టెలను ఊరేగిస్తారు.. ఈ తొట్టెల కింద నుంచి జనం వెళ్లేందుకు జనం పోటీపడ్డారు. చిన్న పెద్ద తేడా లేకుండా తొట్టెల కింద కూర్చొని నుంచి ఆయురారోగ్యాలను ప్రసాదించు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు.
ఊరేగింపు !నీ అడుగడుగునా భక్తులు నీరాజనాలు – అమ్మవారి దర్శించుకున్న ప్రముఖులు
ఎన్నికల ఏడాది కావడంతో ఆయా పార్టీలకు చెందిన నేతలు భారీఎత్తున తను అనుచరులతో వచ్చి ఈసారి అమ్మవారి దర్శనం చేసుకు న్నారు. దర్శనం కోసం వచ్చిన వారికి నిర్వాహకులు స్వాగతం పలికి సత్కరించారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు దర్శించుకున్నారు.