Friday, November 22, 2024

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాసగౌడ్

మహబూబ్‌నగర్ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని స్టేడియం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కేసీఆర్ – 2021 జిల్లా స్థాయి పురుషుల ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్‌ను మంత్రి ప్రారంభించారు. వాలీబాల్ క్రీడలో పాలమూరు నుంచి అనేక మంది జాతీయ స్థాయికి ఆడారని మంత్రి గుర్తు చేశారు. మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్న వాలీబాల్ అకాడమీ ద్వారా మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత సారధ్యంలో ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, జాగృతి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రామ్మూర్తి, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా ఒలంపిక్ కమిటీ అధ్యక్షుడు రవికుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement