ప్రభన్యూస్: ప్రముఖ డిజిటల్ సేవాసంస్థ గూగుల్ పే తమ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకురానుంది. వాయిస్‌తో పేమేంట్ చేసేవిధంగా స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ పే ప్రకటించింది. గూగుల్ పే వినియోగదారుడు తన వాయిస్‌తో మాట్లాడి అవతలవారికి చెల్లింపులు చేసేవిధంగా స్పీచ్ టు టెక్స్ట్ (వాయిస్ పేమెంట్) అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. యాప్‌లో భాషను ఎంచుకునేందుకు ఇండస్ట్రీ ఫస్ట్ అండ్ ఎ ఫస్ట్ ఫర్ గ్లోబల్లి ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ అంబరీశ్ మాట్లాడుతూ డబ్బులను చెల్లించే ప్రక్రియలను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ప్రతి వినియోగదారుడికి ఆర్థిక అవకాశాలను సృష్టించనున్నామన్నారు. భారత్‌లో డిజిటల్ చెల్లింపుల్లో తాము కీలకపాత్ర పోషిస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మాటల ద్వారా గూగుల్ పేలో కావాల్సిన ఖాతా నంబర్‌కు పేమేంట్ చేయొచ్చని పేర్కొన్నారు. టైప్ చేసి పేమేంట్ చేసేటపుడు ఎంత భద్రత ఉంటుందో స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్‌లోనూ అంతే భద్రత ఉంటుందని వివరించారు. కోటిమందికిపైగా వ్యాపారులు గూగుల్ పేను వినియోగిస్తున్నారని అంబరీశ్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital