Monday, November 25, 2024

విద్యార్థుల ఆత్మహత్యలపై హై కోర్టు జడ్జితో విచారణ – విజెఎస్ విద్యార్ధి సంఘం డిమాండ్

బాస‌ర – తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం (VJS)రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ట్రిపుల్ ఐటీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు, ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థి జన సమితి నేతలను పోలీసులు అరెస్టు చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికీ స్పందించ‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు.

విద్యార్థుల ఆత్మహత్యల మీద సిట్టిoగ్ హై కోర్టు జడ్జ్ తో విచారణ జరిపించాలని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున ఏక్స్ గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో VJS నాయకులు బసoత్, మహేష్, మనోజ్ కుమార్, సతీష్, గంగాధర్, నవీన్,విజయ్, కృష్ణ, నరేష్, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement