నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రానున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు.
దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో ఇవాల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
నేడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు రోడ్ల మరమ్మతులు చేపట్టారు. నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గొల్లపల్లి టోల్‌గేట్ వయా పెద్దగోల్కొండ మీదుగా ఇండియన్ బేకరీ (తొండుపల్లి), బుర్జుగడ్డ వద్ద యూటర్న్ తీసుకొని ముచ్చింతల్, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్, తిమ్మాపూర్, షాద్‌నగర్ మీదుగా మళ్లిస్తారు.