పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాడూరి వినోద్ కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఎన్నికలో 540 మంది సభ్యులకు గాను 478 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాలుగు ఓట్లు చెల్లకుండా పోయాయని ఎన్నికల అధికారి ఉప్పు రాజు పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మాడూరి వినోద్ కుమార్ కు 342 ఓట్లు రాగా భిక్షపతి కి 131 ఓట్లు రాగా 212 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
కోశాధికారి పదవికి పోటీచేసిన పోలు సతీష్ కు 370 ఓట్లు రాగా కృష్ణప్రసాద్ కు 105 ఓట్లు రావడం తో 265 ఓట్ల మెజార్టీతో సతీష్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఎన్నికలను రాష్ట్ర అబ్జర్వర్ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షించారు. అధ్యక్ష, కోశాధికారి లకు ఎన్నికల అధికారి ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వినోద్ కుమార్ భారీ మెజార్టీ గెలుపు పొందడం పట్ల పెద్దపల్లి కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ అ విజయానికి సహకరించిన సభ్యులకు అధ్యక్షుడు వినోద్ కుమార్, కోశాధికారి సతీష్ లు కృతజ్ఞతలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital