హైదరాబాద్, : మాయదారి మహమ్మారి రాకతో జనం అల్లాడిపోతున్నారు. కరోనా నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ విధించడంతో నగర వాసులంతా గతేడాది లాగే ఈ సారి కూడా వారి స్వస్థలాకు పయనమవుతున్నారు. అయితే ఇప్పటికే పల్లెటూర్లలోనూ కొవిడ్ పాగా వేసి..పల్లె ప్రజలను కాటేస్తుండగా, తాజాగా పట్నం వాసులు పల్లెలకు వెళ్తుండ డంతో పల్లె ప్రజలు భయపడుతున్నారు. ఒకరకంగా ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే మంచిదంటూ గ్రామాల్లో చర్చించుకుం టున్నారు. అయితే ఇదంతా వచ్చే వారిని రావొద్దని కాదు, వైరస్ ఉధృతి నేపథ్యంలో జాగ్రత్తల కోసమేనని చెప్తున్నారు గ్రామీణజనం. గతేడాది మార్చిలో లాక్‌డౌన్ విధించడం, దాన్ని పలు దఫాలుగా పొడిగించడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొ న్న ప్రజలు ఈ సారి ఆ ఇబ్బందులను ఎదర్కోలేమన్న భావనతో లాక్‌డౌన్ సడలింపు సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటలలోపే స్వస్థలాకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సడలింపు ప్రయాణం..
ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ ఉధృతి రీత్యా లాక్‌డౌన్ విధించగా, దీన్ని మరింత పొడిగిస్తారన్న భావనతో పట్నంలోని పల్లెవా సులు వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే ప్రధానంగా రోజు వారీ కూలీలతో పాటు ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉండడం గమనార్హం. లాక్‌డౌన్ కంటే ముందునుంచే మ#హమ్మారి విజృంభనతో పలు రకాల రంగాలకు ఇబ్బందులు ఏర్పడడంతో ఆయా రంగాల ఉద్యోగులంతా వారి ఊర్లకు వెళ్లిపోయారు. తాజాగా ఇపుడు లాక్‌డౌన్ నేపథ్యంలో ఇది ఎన్ని రోజులు ఉంటు ందో తెలియక, నగరంలో ఇబ్బందులు పడలేకపోవడంతో పాటు ఏదైనా సమస్య ఎదురైతే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థంకాక ఎవరి గ్రామాలకు వారు పయనమవుతున్నారు.
వాస్తవానికి #హదరాబాద్‌తో పాటు మిగతా జిల్లాల్లో నివా సముంటున్న వారిలో చాలామంది స్వస్థలాలు వేరే ప్రాంతం కావడంతో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినపుడు మాత్రం ఎవరి ఊరు వారు వెళ్లిపోతున్నారు. అయితే సొంతూరు కాబట్టి ఎవరూ ఏమి అనరన్న ధైర్యంతో పాటు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మన అనుకున్న వారు నలుగురుంటారన్న కొండంత ధైర్యంతో ఊర్లకు వెళ్తున్నారు. అయితే ధైర్యంగా వారు ఊర్లకు వెళ్తున్నప్పటకీ గ్రామాల్లో కూడా ఈ సారి పరిస్థితులు గతేడాది కంటే భిన్నంగా ఉండడంతో బయటి నుంచి వస్తున్న వారి పట్ల గ్రామాల ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఆదుకున్న పల్లెలు..
గతేడాది వైరస్ వ్యాప్తితో పల్లె ప్రజలంతా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారందరిని ఆదరించి, అక్కున చేర్చుకు న్నారు. కానీ ఈ సారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉండడంతో నగర వాసులు గ్రామంలోకి వస్తున్నారంటేనే ఆందోళన చెందుతు న్నారు. కొవిడ్ టెస్ట్‌లు చేయించుకుని వస్తున్నప్పటికీ.. మా పరిస్థితే బాగోలేదు మళ్లిd మీరొస్తే ఊళ్లో కూడ ఇబ్బందవుతుం దంటూ చెప్పడం గమనార్హం. వైరస్ మొదట్లోనే చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంతో ఇంటిబాట పట్టగా..ఇపుడు లాక్‌డౌన్‌తో నగరాల్లో చేసేదేమీలేక ఇళ్ల బాట పడుతున్నవారు మరికొందరు. వాస్తవానికి ఎవరి ఊరికి వారు వెళితే ఇబ్బందేమీ ఉండదు కానీ..ఈ సారి రెండో దశ వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పల్లె ప్రజలు భయపడుతున్నారు.
ఈ సారి కొవిడ్‌తో వణుకుతున్న పల్లెలు..
పోయినేడాది వైరస్ పల్లెలకు చేరకపోవడంతో వ్యవసాయ పనుల నుంచి ప్రతి రంగానికి ఇబ్బంది కలగలేదు. దీంతో నగర, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వచ్చినా పెద్దగా పల్లె లు ఇబ్బంది పడలేదు. కానీ ఈ సారి పల్లెలు కూడా కరోనాతో వణుకుతుండగా, గ్రామాల్లోనే ఈ దఫా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. గ్రామాల్లో నమోదవుతున్న కేసుల కారణ ంగా చాలా వరకు నిశ్చయించుకున్న పెళ్లిళ్లు కూడా నిలిచిపోయి, ము#హుర్తాలను మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. గతేడారి పట్నాలను వణికించిన కొవిడ్ పల్లెలపై పెద్దగా ప్రభావం చూపక పోవడంతో ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందనుకుని పల్లె జనం నిర్లక్ష్యం వ#హంచడంతోనే గ్రామాల్లో ఈ సారి కొవిడ్ తీవ్రతరం అయిందని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి పల్లెల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్నం వాసులు పల్లెకు వస్తున్నారంటేనే జనం భయపడిపోతున్నారు.
ఈ సారి లాక్‌డౌన్ విధించినప్పటికీ ఉదయం సమయంలో నాలుగు గంటల పాటు నిత్యావసరాలకు, తదితరాలకు మినహా యింపునివ్వడంతో ఈ సమయంలోనే నగరాలు, ఇతర ప్రాంతాల నుంచి పల్లెలకు వెళ్తున్నారు ప్రజలు. వీరు వెళ్తున్న క్రమంలో నగరం నుంచి వ్యాధిని తీసుకెళ్తున్నారని కూడా పలు వురు చెబుతున్నారు. లాక్‌డౌన్ విధించిందే ఎక్కడి వారు అక్కడే ఉంటే వ్యాధి లింక్ తెగిపోయి..వ్యాధి తగ్గుతుందని..కానీ లాక్‌డౌ న్‌తో గతేడాది ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుతెచ్చుకుని మళ్లిd అలాంటి పరిస్థితులే ఎదురవుతాయేమోనని ఎవరికి వారే గ్రామాలకు వెళ్తున్నారు. ఇదే సమయంలో నగర వాసుల రాకతో పల్లె జనం కూడా భయపడడంతో పాటు రోజురోజుకు పల్లెల్లో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడుంటేనే మంచిదని కూడా వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.
నగరం నుంచి వలసలు… వణకుతున్న గ్రామాలు…
Advertisement
తాజా వార్తలు
Advertisement