పోలింగ్ కేంద్రం లేక ఆదిలాబాద్‌లోని ఓ గ్రామస్థులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోచారు. తమకు మరో అవకాశం కల్పించాలని ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండి గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
రవాణా సదుపాయం కూడా లేకపోవడంతో మరో కేంద్రానికి కూడా వెళ్లలేకపోయామని తెలిపారు. ఈ మేరకు గ్రామస్థులు కలక్టరెట్కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. పాలనాదికారి అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని ఇన్వర్డ్ విభాగంలో వినతి పత్రాన్ని అందజేశారు.