హైదరాబాద్: హైదరాబాద్ ఇంచార్జ్ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఇవాళ భేటీ అయ్యారు. సోమాజిగూడలోని మంత్రి నివాసంలో విక్రమ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు విక్రమ్ గౌడ్ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement