హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వికాస్‌రాజ్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనను మరే ఇతర అధికారిక ఇన్‌చార్జిబాధ్యతల్లో కొనసాగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఈ సందర్భంగా ఆదేశించింది.
కేవలం సీఈవోగానే కొనసాగించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదివరకు ఈ పదవిలో పనిచేసిన శశాంక్ గోయల్‌ను డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు బదలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసిన తర్వాత కేంద్రం అనేక నాటకీయ పరిణామాలకు తెరలేపింది. అఖిల భారత సర్వీస్ అధికారుల డిప్యుటేషన్లపై కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది.