వికారాబాద్ ( ఆంధ్రప్రభ): తాండూర్ లో జరిగిన సంఘటన ను తెలుసుకునేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాత్రులను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చెన్నారెడ్డి కూడా లేవద్దా వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశం సారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా వికారాబాద్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సీఐ భీమ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు అరుణ్ కుమార్ శ్రీనివాస్ తదితరులు మాజీ మంత్రుల వాహనాలను అడ్డుకొని ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు సవిత ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ని ఖూనీ చేశారా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం పరిష్కరించాల్సింది మరిత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.. పోలీసుల చర్యను నిరసిస్తూ, వారు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారిని పోలీసులు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ కౌన్సిలర్ అనంతరెడ్డి తదితరులు ఉన్నారు.