వికారాబాద్ జనవరి 16 ( ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో గల రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న ఓవర్ బ్రిడ్జి కొంత కృంగిపోవడంతో గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నూతన బ్రిడ్జి నిర్మాణానికి 96 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.ఇoదుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.
గతంలో ఐటి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ స్థానిక మాజీ శాసనసభ్యుడు ఆనంద్ నియోజకవర్గం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిపారు. 96 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ రోడ్డు ఓ బ్రిడ్జి పనులకు సంబంధించిన స్థల సేకరణతో పాటు పనులను పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి దాదాపు నాలుగు క్రెన్లా సహాయంతో స్థల సేకరణలో స్థలాన్ని ఖాళీ చేయించడం ఎక్కడి వరకు బ్రిడ్జి వస్తుందన్న ప్రాంతాన్ని గుర్తించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు పనుల ప్రారంభించిన దృశ్యం చూసి హర్షం వ్యక్తం చేశారు.