Sunday, November 17, 2024

ఈ విద్యా సంవత్సరం నుండే వికారాబాద్ మెడికల్ కళాశాల ప్రారంభం.. హరీశ్ రావు

వికారాబాద్, ఏప్రిల్ 13 ( ప్రభ న్యూస్): ఈ విద్యా సంవత్సరం నుండి వికారాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ప్రారంభమవుతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మర్పల్లి మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆనంద్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమయంలో ఆయన మాట్లాడుతూ… 150 కోట్ల రూపాయలతో ఈ విద్యా సంవత్సరం నుండి మెడికల్ కళాశాల ఆరంభమవుతుందని కళాశాలలో 600 మెడికల్ సీట్లు ఉంటాయని ఆయన తెలిపారు. రూ.15 కోట్లతో ఆయుష్ ఆసుపత్రికి సైతం శంకుస్థాపన చేసినట్టు ఆయన వెల్లడించారు.

తెలంగాణ మొత్తంలో మూడు ఆయుష్ ఆసుపత్రులు మంజూరు చేయగా, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ కృషితో వికారాబాద్ లో ఆయుష్ ఆస్పత్రి వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు మరుపల్లి మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు కోసం రూ.10కోట్లను మంజూరు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచ్ నర్సింహారెడ్డి, మర్పల్లి మండల జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement