Thursday, September 12, 2024

Vikarabad – కూలిన ఇళ్ళు – ఆదుకోవాలని వినతులు

వికారాబాద్, సెప్టెంబర్ 1 (ప్రభ న్యూస్): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు బూరుగుపల్లి లో పాత ఇల్లు కూలింది .

సంబంధిత గృహాన్ని మాజీ జడ్పిటిసి ముత్తాహర్షరీఫ్ ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ముతహర్షి మాట్లాడుతూ పాడుబడ్డ పాత ఇండ్లలో ఎవరూ నివసించకూడదని ఆయన సూచించారు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు సంబంధిత ఇంటి యజమానికి ప్రభుత్వపరంగా సహాయం చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు..

- Advertisement -

కొత్తగడిలో కూలిన ఇల్లు

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో భారీ వర్షానికి ఓ పాత ఇల్లు కూలిపోయింది. గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఈ ఇల్లు కూలినట్టు స్థానికులు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కూలిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి సహాయం అందించాలని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement