Wednesday, November 20, 2024

Vikarabad – నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు..! నలుగురు అరెస్ట్


– రూ. 7లక్షల 95 వేల ఫేక్ కరెన్సీ స్వాదీనం
– నలుగురు నిందితుల అరెస్టు, రిమాండ్
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

వికారాబాద్, జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ నోట్ల మిస్టరిని జిల్లా పోలీసులు చేధించారు. జిల్లాలోని తాండూరులో గత కొన్ని రోజులుగా నకిలీ నోట్ల చెలామణిపై పుకార్లు జోరందుకున్నాయి. దీంతో ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు బండల వ్యాపారిని అదుపులోకి తీసుకోవడంతో ముఠా డొంక మొత్తం కదిలింది. నలుగురు నిందితులను అదపులోకి తీసుకుని ముఠా సభ్యుల నుంచి రూ. 7లక్షల 95వేల నగదు, కంప్యూటర్, ప్రింటర్, పేపర్లు, రిబ్బన్, 5 మోబైల్‌ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. శనివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.

- Advertisement -

తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండలం ఇందర్‌ చెడ్ గ్రామానికి చెందిన మండిగి చంద్రయ్య అలిలాస్ చంద్రప్ప తాండూరు పట్టణం అయ్యప్ప నగర్‌లో నివాసం ఉంటున్నారు. బండల వ్యాపారం చేసే చంద్రప్ప ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లా సుంకరిపేటకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ మేనేజర్ ఇచ్చాపురం జగదీష్‌, కోనసీమ జిల్లా రాంచంద్రపురం మండలం నరసారావుపేటకు చెందిన బడుగంటి వీర వెంకట రమణ అలియాస్ వెంకీ, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంకు చెందిన ప్రగల్లపాటి శివకుమార్‌లతో కలిసి నకిలీ నోట్ల తయారి ముఠాగా ఏర్పడ్డారు.

మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్‌ పోలీస్టేషన్ పరిధి మల్లంపేటలోని ఎస్ఆర్ఎస్ వృషభాద్రి అపార్ట్ మెంట్ లో కంప్యూటర్ మానిటర్, సీపీయూ, కలర్ ప్రింటర్, రిబ్బన్ తదితర వస్తువులతో నకిలీ నోట్లను తయారు చేసి చెలామణి చేయిస్తున్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలో చంద్రయ్యను స్థానిక పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకోగా గుట్టు రట్టయ్యింది. చంద్రయ్యతో పాటు అపార్ట్‌మెంట్‌లో రూ. 7లక్షల 95వేల ఫేక్ కరెన్సీ, కంప్యూటర్, సామాగ్రి, 5 సెల్‌ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement