వికారాబాద్ ( ప్రభ న్యూస్) : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కన్నుల పండుగగా పట్టణ ప్రగతి దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో, ఐటి .. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు పట్టణ ప్రగతి ఉత్సవాల కార్యక్రమాన్ని చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ముందు చైర్ పర్సన్ జాతీయ జెండా ఆవిష్కరించడంతో ప్రారంభమైన పట్టణ ప్రగతి ఉత్సవాలు… మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, కమిషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య వాహనాలను ప్రదర్శిస్తూ భారీ ఎత్తున కన్నుల పండుగగా ర్యాలీ నిర్వహించారు. చైర్ పర్సన్ పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో దశాబ్ది (10) ఆకారంలో మానవహారం నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement