Saturday, January 4, 2025

Vikarabad – బాలుడి కిడ్నాప్ క‌థ సుఖాంతం… త‌ల్లి చెంత‌కు బిడ్డ‌

తాండూరు రూరల్ : తాండూరు మండలం గౌతాపూర్‌ గ్రామంలో ఏడాది బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. పోలీసుల సహాయంతో బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. కరణ్‌ కోట్ పోలీసులు 24 గంటల్లోనే బాలుడు ఆచూకీని కనిపెట్టారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన భాష భార్య గోరీబీ, ముగ్గురు కుమారులు, అత్త, మరదలుతో కలిసి గౌతాపూర్ గ్రామంలో పనులు చేసుకునేందుకు వలస వచ్చాడు. గ్రామంలోని మల్లన్ప స్వామి దేవాలయం వద్ద ఉంటు గ్రామంలో గ్యాస్ స్టవ్, మిక్సీ రిపేర్ల పనులు చేసుకునేవాడు. అయితే ఆదివారం రాత్రి అందరు పడుకున్నారు. సోమవారం తెల్లవారు జామున వారి ఏడాది కుమారుడు హుస్సేన్‌ను కనిపించలేదు.

దీంతో బాలుడును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని వదంతులు రాగా ఎస్ఐ విఠల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడు ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకున్న 24 గంటల్లోనే పోలీసులు బాలుడు ఆచూకీని కనిపెట్టారు. వికారాబాద్‌ జిల్లా బంటారం మండలంలో బాలుడిని గుర్తించారు. పోలీస్టేషన్‌లో బాలుడును తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలుడును ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలుడి తండ్రితో నిందితులకు ముఖ పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement