Tuesday, November 26, 2024

కాంగ్రెస్ ను గెలిపించినా టీఆర్ఎస్ లోనే చేరుతారు

తెలంగాణలో కౌశిక్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారిన నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. 2018లో కాంగ్రెస్ నుండి హుజూరాబాద్ లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఆ పార్టీ వద్దని రాజీనామా చేసారని గుర్తు చేస్తూ… కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని కౌశిక్ రెడ్డి చెప్పటం ఇప్పుడు అర్థం చేసుకోవలసిన పరిణామమని అన్నారు. కౌశిక్ రెడ్డి మాత్రమే కాదు తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్‌తో సాధ్యపడదనే అభిప్రాయంలో చాలా మంది నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెసుకు ఓటు వేసి గెలిపించినా టీఆర్‌ఎస్‌లోనే చేరతారని, ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం కళ్ళముందే ఉంది కదా! అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్న టీపీసీసీ ప్రకటన కూడా మాటలకే పరిమితమయ్యేలా కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణను లూటీ చేసి, అప్పుల్లో నెట్టిన టీఆర్‌ఎస్‌ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని విజయశాంతి చెప్పారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement