Wednesday, November 20, 2024

దొర ఎన్నాళ్ళు ఈ నీచ రాజకీయాలు?

దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’ పథకంపై ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. దొర ఎన్నాళ్ళు ఈ నీచ రాజకీయాలు? అంటూ నిప్పులు చెరిగారు. బీజేపీని తట్టుకోలేక, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసకుంటున్నారని విమర్శించారు. సొంత పార్టీ మంత్రులకే టైం ఇవ్వలేని ముఖ్యమంత్రి.. ఈనాడు ఆల్ పార్టీ మీట్ నిర్వహించం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఇదేనా మనం కోరి తెచ్చుకున్న బంగారు తెలంగాణా? అంటూ విజయశాంతి ప్రశ్నించారు.

కాగా, నిన్న ప్రగతిభవన్ లో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో దళితుల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని  అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలను వెతకాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కు రూ.1000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మరో రూ.500 కోట్లు అదనంగా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలనేది తమ ప్రభుత్వ యోచన అని సీఎం కేసీఆర్ వివరించారు.

ఇది కూడా చదవండి: మాట వినని మాజీ మంత్రి.. మోత్కుపల్లిపై బీజేపీ సీరియస్‌!

Advertisement

తాజా వార్తలు

Advertisement