హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పాడి పరిశ్రమను మరింతగా ప్రోత్సహించేందుకు మండలాల వారీగా కమిటీలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించాలని కోరుతూ అసెంబ్లీలో గురువారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. దళితబంధు లబ్ధిదారులు సైతం పాడి యానిట్లు ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విజయ డెయిరీ టర్నోవర్ 750 కోట్లు దాటిందని వెల్లడించారు. రాష్ట్రంలో పాడి రైతులకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. మండలాల వారీగా కమిటీలు వేస్తామన్నారు. ఇన్సెంటివ్ విషయంలో ప్రభుత్వం ఆలస్యం అయినప్పటికీ.. దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో పాడి సంపదను పెంపొందించడానికి.. దళితబంధు లబ్ధిదారులు పాడి యూనిట్లు ఎంపిక చేసుకున్నారుని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement