విజయదశమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో కలసి ఆయుధ, వాహనపూజలు నిర్వహించారు. తొలుత ఆయుధ పూజ చేసిన మంత్రి వాహన పూజ కూడా చేశారు.
ఆయుధపూజలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకులను కూడా ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గౌరవ సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని, అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు పొందిందని అన్నారు.