Home తెలంగాణ‌ TG | ప్రజాపాలన విజయోత్సవాలు.. అదిరిపోయేలా కార్యక్రమాలు

TG | ప్రజాపాలన విజయోత్సవాలు.. అదిరిపోయేలా కార్యక్రమాలు

0

ఆంధ్రప్రభ, హైద‌రాబాద్‌ : ప్రజా పాలన విజయోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ముగింపు ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నెక్లెస్​ రోడ్డు పరిసరాల్లో సంబురాలకు సన్నాహాలు చేసింది. ఆదివారం వైమానిక విన్యాసాలు, రాహుల్​ సిప్లిగంజ్​ మ్యూజిక్​ ఈవెంట్​ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం సచివాలయంలో ఈ మధ్యాహ్నం ఉంటుంది.

రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ..

చివరి రోజైన డిసెంబరు 9వ తేదీన సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇదే రోజు సంగీత దర్శకుడు థమన్​ మ్యూజికల్​ నైట్​, డ్రోన్​, టపాసుల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల మూడు రోజులు ప్రముఖ ప్రాంతాలతో పాటు కట్టడాలు జిగేల్​ మనేలా విద్యుత్​ లైట్లతో అలంకరించనున్నారు.

మూడు వేదికలుగా కార్యక్రమాలు.. వివరాలు ఇవే..
= సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్​ షో
= 5 గంటలకు టీఎస్​ఎస్​ కళాకారులు వడ్డే శంకర్ పాటలు ఉంటాయ
= 6 గంటలకు బోనాల కోలాటం
= 7 గంటల వరకు రాజీవ్ విగ్రహం వేదికగా.. మైథిలి అనూప్ అండ్ టీమ్ మోహిని అట్టం ప్రదర్శన
= 7 నుంచి 8.30 వరకు సింగర్​ రాహుల్​ సిప్లిగంజ్​ సంగీత కచేరి
= 8 గంటల వరకు పి.ప్రమోద్ రెడ్డి అండ్ టీమ్ భరతనాట్యం
= 9 గంటల వరకు బిర్రు కిరణ్, టీమ్ థియేటర్ స్కిట్
= నెక్లెస్ రోడ్ వేదికగా పుడ్ స్టాల్స్, హ్యాండీక్రాప్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి.

Exit mobile version