ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ప్రజా పాలన విజయోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ముగింపు ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో సంబురాలకు సన్నాహాలు చేసింది. ఆదివారం వైమానిక విన్యాసాలు, రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ ఈవెంట్ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం సచివాలయంలో ఈ మధ్యాహ్నం ఉంటుంది.
రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ..
చివరి రోజైన డిసెంబరు 9వ తేదీన సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇదే రోజు సంగీత దర్శకుడు థమన్ మ్యూజికల్ నైట్, డ్రోన్, టపాసుల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల మూడు రోజులు ప్రముఖ ప్రాంతాలతో పాటు కట్టడాలు జిగేల్ మనేలా విద్యుత్ లైట్లతో అలంకరించనున్నారు.
మూడు వేదికలుగా కార్యక్రమాలు.. వివరాలు ఇవే..
= సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్ షో
= 5 గంటలకు టీఎస్ఎస్ కళాకారులు వడ్డే శంకర్ పాటలు ఉంటాయ
= 6 గంటలకు బోనాల కోలాటం
= 7 గంటల వరకు రాజీవ్ విగ్రహం వేదికగా.. మైథిలి అనూప్ అండ్ టీమ్ మోహిని అట్టం ప్రదర్శన
= 7 నుంచి 8.30 వరకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సంగీత కచేరి
= 8 గంటల వరకు పి.ప్రమోద్ రెడ్డి అండ్ టీమ్ భరతనాట్యం
= 9 గంటల వరకు బిర్రు కిరణ్, టీమ్ థియేటర్ స్కిట్
= నెక్లెస్ రోడ్ వేదికగా పుడ్ స్టాల్స్, హ్యాండీక్రాప్ట్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి.