హైదరాబాద్, ఆంధ్రప్రభ : యాదగిరి గుట్ట దేవాలయానికి వచ్చే వారి వాహనాలకు ఖరారు చేసిన పార్కింగ్ ఫీజుపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తీవ్రంగా మండిపడింది. హిందూ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం కేవలం తమ ఖజానా నింపే ఆర్థిక వనరుగా మాత్రమే చూస్తుందనేందుకు ఈ నిర్ణయం నిలువెత్తు సాక్ష్యమని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు ఎం. రామరాజు, ప్రాంత కార్యదర్శి బండారి రమేష్, బజరంగ్‌దళ్ ప్రాంత ప్రముఖ్ శివరాములు మండిపడ్డారు.
యాదగిరి గుట్టకు వచ్చిన భక్తులు ప్రభుత్వ వైఫల్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారనేది జగమెరిగిన సత్యమన్నారు. భక్తుల ఇక్కట్లను తొలగించేందుకు ఏ మాత్రం దృష్టి పెట్టకపోగా వారిపైనే ఆర్థిక భారం మోపాలని నిర్ణయించడం దారుణమన్నారు. పార్కింగ్ ఫీజు నిర్ణయాన్ని దేవాదాయ శాఖ వెంటనే వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..