Tuesday, December 3, 2024

Verdict – న‌క్స‌ల్స్ మృత దేహాల‌ను బంధువుల‌కు అప్ప‌గించండి – హైకోర్టు

హైదరాబాద్‌:ఏటూరునాగారంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్‌,ప్రభుత్వం తరపున వాదనలను కోర్టు విన్నది. న‌క్స‌లైట్లై ఎటువంటి విష ప్ర‌యోగం జ‌రగ‌లేద‌ని ప్ర‌భుత్వ త‌రుపు న్యాయ‌వాది కోర్లుకు వివ‌రించారు.. పోలీసులు ప‌ద్ద‌తి ప్ర‌కార‌మే వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పారు.. వాద‌న‌ల విన్న‌న్యాయ‌మూర్తి ఐలమ్మ భర్త మధు అలియాస్‌ మల్లయ్య మృతదేహాన్ని భద్రపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తన భర్త మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయన్న ఐలమ్మ తరపు న్యాయవాది వాదనల మేరకు హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.

కుటుంబ సభ్యులు అడిగితే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇతర మావోయిస్టుల మృతదేహాలను హ్యాండ్‌ఓవర్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా,ఆదివారం ఏటూరునాగారం చల్పాక వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే మావోయిస్టుల మృతిపై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులతో పాటు పౌరహక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి.హైకోర్టు ఆదేశాలతో మావోయిస్టుల మృతదేహాలను కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ) మార్చురిలో పోలీసులు భద్రపరిచారు. కోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల తర్వాత మధు బాడీ తప్ప మిగిలిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement