Monday, November 18, 2024

Vemulawada : వరాల జల్లు.. 127.65 కోట్ల విడుద‌ల‌

  • రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి చ‌ర్య‌లు
  • ఆల‌య కాంప్లెక్స్ విస్త‌ర‌ణ‌, అధునాత‌న వ‌స‌తులు
  • మూల‌వాగు బ్రిడ్జి వ‌ర‌కు రోడ్డు వెడ‌ల్పు
  • సంతోషం వ్య‌క్తం చేస్తున్న భ‌క్తులు

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు సోమవారం మంజూరు చేసింది. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్డును వెడల్పు చేసేందుకు రూ.47.85 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరలో చేపడుతారు. మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్ లైన్ నూతన డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8కోట్ల పనులకు పరిపాలక ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజన్న ఆలయానికి అభివృద్ధి సంక్షేమం కోసం రూ.127 కోట్ల నిధులను మంజూరు చేయడం పట్ల వేములవాడ పట్టణవాసులు రాజన్న భక్తులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement