Sunday, November 17, 2024

TG: వేములవాడ రాజేశ్వరిదేవికి.. అగ్గిపెట్టెలో ఇమిడిన చీర కానుక‌..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, వేముల‌వాడ : రాజ‌న్న సిరిసిల్ల‌కు చెందిన చేనేత కార్మిక కుటుంబాల‌కు చెందిన యువ‌కులు వినూత్న ప్ర‌యోగాల‌తో చీర‌లు నేస్తూ ఉంటారు. అందులో భాగంగా న‌ల్ల విజ‌య్‌కుమార్ అనే యువ‌కుడు అగ్గిపెట్టెలో ఇమిడే చీర‌ను త‌యారు చేసి వేముల‌వాడ రాజేశ్వ‌రిదేవికీ కానుక‌గా ఈ రోజు అంద‌జేశాడు. ఇప్పటికే చాలాసార్లు వివిధ డిజైన్లలో, వినూత్న రీతిలో చీరలు నేసి ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లకు కానుకగా సమర్పించిన‌ట్ల విజ‌య్‌కుమార్ తెలిపారు.

చీర త‌యారీకి మూడు రోజులు ప‌ట్టింది…
అమ్మ‌వారికి కానుక‌గా ఇచ్చిన చీర‌ అయిదున్నర మీటర్ల పొడవు, 48ఇంచీల వెడల్పు, వంద గ్రాముల బరువు ఉంటుంద‌ని, అలాగే శాలువా రెండు మీటర్ల పొడవు, 32 ఇంచీల వెడల్పు, 40 గ్రాముల బరువు ఉంటుంద‌ని, వీటిని మూడు రోజుల్లో తయారు చేసినట్లు విజయ్‌కుమార్‌ తెలిపారు. కుటుంబ సమేతంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకుని ఈచీర‌ను ఆల‌య ఈఓ వినోద్‌రెడ్డికి, ఆల‌య అర్చ‌కుల‌కు అంద‌జేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement