Friday, November 22, 2024

TS : శివ కళ్యాణం ఉత్సవాలకు వేములవాడ ముస్తాబు… భక్తుల రద్దీ…

దక్షిణ కాశిగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో శివ కళ్యాణ మహోత్సవాల వేడుకకు ఆలయ అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈనెల 27నుండి31 వరకు శివ కళ్యాణ మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో శివ కళ్యాణ మహోత్సవ వేడుక వేదిక పనులను వేగవంతం చేశారు.

- Advertisement -

రాజన్న సన్నిధిలో జరిగే శివన్న కళ్యాణ వేడుకకు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆర్య ఇన్చార్జి ఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

రాజన్న సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది .ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ 33 జిల్లాల నుండి సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకొని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వారీ వారిని దర్శించుకుని స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా దాదాపు 40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
శివ కళ్యాణ మహోత్సవ వేడుక కార్యక్రమాలు…
మార్చి 27న శివ కళ్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. 28న నిర్వహించే శ్రీపార్వతీరాజరాజేశ్వర స్వామివార్ల కళ్యాణమహోత్సవమునకు ఆలయంలో యాగశాల ,ఇతరత్రా ఏర్పాట్లుచేశారు. 30 న సాయంత్రం గం.3.05 ని.లనుండి శ్రీస్వామివారి రథోత్సవము నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement