దక్షిణ కాశీగా వీరాజీల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ,మహారాష్ట్ర, చత్తీస్గడ్ ల నుండి వేలాది సంఖ్యలో స్వామివారి భక్తులు తరలివచ్చారు.
తెల్లవారుజామున పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బార్లు తీరారు. స్వామివారి దర్శనం కోసం సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా నలభై లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ ఇంచార్జి ఈఓ రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు…
- Advertisement -
.