Monday, January 13, 2025

Vemulawada – భక్తులతో పోటెత్తిన రాజన్న ఆలయం

వేములవాడ ఆంధ్రప్రభ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన సంద్రమైంది. సెలవు దినం కావడంతో ఆదివారం స్వామివారిని దాదాపు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పక్క రాష్ట్రాల తో పాటు తెలంగాణ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సుమారు 40 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇన్చార్జి ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement